|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:46 AM
నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో దక్షిణ రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి ప్లీనరీ సమావేశం ఆదివారం జరిగింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో యాదవ సమాజ అభివృద్ధి, విద్యా, ఉపాధి అవకాశాల విస్తరణ, రాజకీయ ప్రాతినిధ్యం పెంపు, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చించారు.