|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 02:06 PM
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శనివారం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన సైనిక దాడిలో ఖమేనీ హతమైనట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో వెల్లడించారు. "చరిత్రలోనే అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతడి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారందరికీ దక్కిన న్యాయం" అని పేర్కొన్నారు.టెహ్రాన్‌లోని ఖమేనీ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాదాపు 30 శక్తిమంతమైన బాంబులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఖమేనీ ఓ భూగర్భ బంకర్‌లో ఉన్నప్పటికీ, అత్యాధునిక అమెరికన్ ట్రాకింగ్ సిస్టమ్స్ నుంచి తప్పించుకోలేకపోయారని సమాచారం.