|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:02 PM
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో ఇవాళ బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడికి డిమాండ్ భారీగా పెరగడంతో ధరలు 3 శాతానికి పైగా ఎగబాకాయి.వివరాల్లోకి వెళితే... ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ 3.12 శాతం పెరిగి 10 గ్రాముల ధర రూ.1,67,155కు చేరింది. అలాగే, ఎంసీఎక్స్ సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 3.04 శాతం లాభపడి కిలో ధర రూ.2,91,249కి ఎగబాకింది.