|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:00 PM
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద సోమవారం నిరసన చేపట్టారు. కామారెడ్డి బీజేపీ శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, వారికి దక్కాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు విశ్రాంత ఉద్యోగులు భారీ సంఖ్యలో మద్దతు తెలిపారు.