|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 03:59 PM
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ దాడులు చేయడం అనైతికమని, యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని అమెరికా ప్రకటించడం దురదృష్టకరమన్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో సమావేశాల నేపథ్యంలో భారత్ ఇరాన్‌పై దాడులకు పరోక్ష మద్దతు ఇస్తోందన్న భావన కలుగుతోందని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయుల భద్రతపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని, రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిళ్ల ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు. మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు.