|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:47 PM
వేములవాడ పట్టణంలో వీధి కుక్కల దాడిలో సుమారు 35 మంది గాయపడ్డారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు బద్ది పోచమ్మ వీధి, వడ్ల కమ్మరి వీధి, పాత కూరగాయల మార్కెట్ ఏరియా, సుభాష్ నగర్, దోబీగాట్ల పరిసరాల్లో ప్రజలపై కుక్కలు దాడి చేశాయి. వీరిని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నవీన్ మాట్లాడుతూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నెల రోజుల్లో రెండోసారి ఇలా జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.