|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:26 PM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఒక యువకుడు బెంజ్ కారుతో రోడ్లపై భయాందోళనలు సృష్టించాడు. తొలుత నానక్‌రాంగూడ వద్ద ఒక కారును ఢీకొట్టి పారిపోతుండగా, ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు అతడిని ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ యువకుడు కారు ఆపకుండా కానిస్టేబుల్‌ను ఢీకొట్టడంతో ఆయన కారు బానెట్‌పై పడిపోయారు.ఓపక్క బానెట్‌పై కానిస్టేబుల్ వేలాడుతున్నా, నిందితుడు అలాగే కారును దాదాపు 800 మీటర్ల వరకు అతివేగంగా తీసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన తోటి వాహనదారులు కారును అడ్డుకోవడంతో కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడిని నార్సింగికి చెందిన తరుణ్ (24)గా గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు 160 ఎంజీ వరకు మద్యం సేవించినట్లు తేలింది. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. కారును స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.