|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:52 PM
TG: వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన పీఏసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత.. ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. 'రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దో. TGలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యింది. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ పత్తా లేదు. రాహుల్ జీ మీ హామీని నిలబెట్టుకోండి' అని పేర్కొన్నారు.