|
|
by Suryaa Desk | Sun, Mar 01, 2026, 09:37 PM
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న వేళ ప్రజల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.ఇరాన్‌తో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లోని పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అక్కడి తెలుగువారు భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే హెచ్చరికలు, భద్రతా సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని పౌరులను క్షేమంగా వెనక్కి రప్పించేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు అక్కడి ఎంబసీలతో టచ్‌లో ఉండాలని అధికారులను ఆదేశించారు.