|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 03:30 PM
ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ అశోక్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన పిక్ బాల్ కోర్ట్‌ను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. కాలనీలో క్రీడా సదుపాయాల ఏర్పాటు చేయడం ఆనందకరమని, ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో క్రీడా స్పూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, యువత మరియు క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.