|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:27 PM
కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో శనివారం విశ్రాంత ఉద్యోగుల 34వ సామూహిక జన్మదిన వేడుకలు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిబ్రవరి నెలలో జన్మదినం జరుపుకుంటున్న ఉద్యోగులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీతారామయ్య కోదాడ పెన్షనర్స్ సంఘం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. విశ్రాంత ఉద్యోగులందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.