|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:23 PM
బాల్య వివాహాలను అరికట్టడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. ఆశ్రిత స్వచ్ఛంద సేవా సంస్థ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సంస్థల ఆధ్వర్యంలో, లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో పట్టణంలో బాల్య వివాహ విముక్త ప్రచార రథయాత్ర శనివారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఈ రథయాత్రను ప్రారంభించి, జిల్లాలో బాల్య వివాహాలు ఇంకా జరుగుతున్నాయని, వాటి నిర్మూలనకు కృషి చేయాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమని తెలిపారు.