|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:20 PM
TG: సౌదీ అరేబియాలోని మదీనాలో గత ఏడాది నవంబర్ 17న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 44 మంది HYD వాసులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఈ మేరకు సచివాలయంలో ఇవాళ బాధిత కుటుంబాలకు CM రేవంత్ రూ. 5లక్షల చెక్కులను అందజేశారు. గాయపడిన ఒకరికి రూ.3లక్షలు ఇచ్చారు. 'దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవు. కానీ బాధితుల కుటుంబాల పరిస్థితి చూసి సాయం ప్రకటించాం' అని సీఎం తెలిపారు.