|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:14 PM
పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి (D) లింగంపేట (M)లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన చాకలి శివకుమార్(17), ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా కొన్ని పేపర్లు సరిగ్గా రాయలేకపోయానని, ఫలితాల్లో ఫెయిల్ అవుతాననే భయంతో శివకుమార్ మనస్తాపానికి గురై శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.