|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 09:40 PM
కోకాపేటలోని శారదా పీఠానికి కేటాయించిన భూమికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. శారదా పీఠానికి కేటాయించిన ఈ భూముల్లో జలమండలి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశించారు. జలమండలికి శారదా పీఠం భూముల కేటాయింపు తక్షణమే రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శారదా పీఠం భూములను జలమండలికి కేటాయించడంతో అక్కడ నిర్మాణ పనులు చేపట్టారు.జలమండలి నిర్మాణ పనులను శారదా పీఠం ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. పీఠం భూములను జలమండలికి కేటాయించిన సమయంలో అక్కడి నిర్మాణాల స్థితిని తెలియజేయకపోవడాన్ని ప్రశ్నించారు. జలమండలికి ఈ భూకేటాయింపులను రద్దు చేసి, శారదా పీఠానికే ఆ భూములు కొనసాగేలా ఆదేశించారు.