|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 03:40 PM
ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారు,పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా ముఖ్యంగా తెల్లాపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఆర్.యు.బి (RUB) పనుల పురోగతిపై GM గారితో చర్చించారు. అలాగే ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడేలా ఎంఎంటిఎస్ (MMTS) సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ వినతిపత్రం సమర్పించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.తెల్లాపూర్ నుండి ఈదుల్ నాగులపల్లి వరకు మరియు తెల్లాపూర్ నుండి ఇక్రిసాట్ వరకు ఎంఎంటిఎస్ విస్తరణ చేయాలని, అలాగే ట్రైన్ల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా ఈదుల నాగులపల్లి ప్రాంతంలో రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా జీఎం గారిని కోరారు. ఈ టెర్మినల్ ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో రైల్వే రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.అలాగే తెల్లాపూర్ ఎంఐజి ప్రాంతం మధ్యలో ప్రజల రాకపోకలకు సౌలభ్యం కల్పించే విధంగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని వీలైనంత తొందరగా డీపీర్ తయారు చేయాలని కోరిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తెలిపారు.మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అక్కన్నపేట రైల్వే స్టేషన్ వద్ద అజంతా ఎక్స్‌ప్రెస్ మరియు రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలుపుదల కల్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.సిద్దిపేట జిల్లా లో చిన్నకోడూరు లో ఇటీవల మంజూరు చేసిన రైల్వేస్టేషన్ పనులు తొందరగా ప్రారంభించాలని అలాగే అన్ని పూర్తి అయినా కొమురవెల్లి రైల్వేస్టేషన్ ని తొందరగా ప్రారంభించాలని కోరిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు.