|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:34 PM
పటాన్చెరు : మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని ఘనపూర్ లో ఆదివారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం, జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కాశి రెడ్డి, రాజ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు,