|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 07:39 PM
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలు కాకపోవడంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ఆర్జేడి (ప్రాంతీయ విద్యా సంచాలకులు) సోమిరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. కార్పోరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ విజ్ఞప్తి నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగింది.