|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:04 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను ఆదరించని ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురానుంది. ఇందులో బాగంగా వారి జీతం నుంచి 10-15% కోత పెట్టి తల్లిదండ్రులకు చెల్లించేలా చట్టాన్ని రూపొందిస్తోంది. పేరెంట్స్ ఫిర్యాదులపై విచారణ చేసి నిజమని తేలితే వారి జాయింట్ ఖాతాలో ఈ సొమ్ము జమచేయనుంది. CS రామకృష్ణారావు, మాజీ CS శాంతికుమారిలతో కూడిన కమిటీ ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించనుంది. 2023 నుంచి నియమితులైన వారికి ఈ చట్టం వర్తించనుంది.