by Suryaa Desk | Sat, Feb 01, 2025, 10:16 AM
TG: సత్యం కంప్యూటర్స్ వ్యవహారంలో టెక్ మహీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. 2002-09 మధ్య సత్యం కంపెనీకి చెందిన వాస్తవ ఆదాయంపైనే ఆదాయపు పన్నును లెక్కించాలంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. సత్యం కంపెనీ చూపిన ఊహాజనిత ఆదాయం ఆధారంగా పన్ను లెక్కించడం సరికాదని తేల్చి చెప్పింది. సత్యం కుంభకోణం నేపథ్యంలో 2002-09 మధ్య వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సీబీడీటీ అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ టెక్‌మహీంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.