by Suryaa Desk | Sat, Feb 01, 2025, 07:55 PM
TG: రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డ్రామా ఆడుతోందని కేటీఆర్ అన్నారు. అలాగే రాష్ట్రంలో 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని సవాల్ చేశానని, దానిపై సీఎం రేవంత్ స్పందించలేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన రైతుబంధు పైసలు కూడా బీఆర్ఎస్ కూడబెట్టినవే అని చెప్పారు. ఎకరాకు రూ.17,500 ఇచ్చేదాకా ప్రభుత్వాన్ని వదలొద్దని, తులం బంగారం ఏదని మహిళలు నిలదీయాలని KTR అన్నారు.