by Suryaa Desk | Mon, Feb 03, 2025, 04:13 PM
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం నారాయణపేట శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం వైభవంగా నిర్వహించారు. ముందుగా సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల ప్రదనాచార్యులు దత్తు చౌదరి మాట్లాడుతూ.. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం గురించి వివరించారు కళలకు, సంగీతానికి, విద్యకు దేవత సరస్వతి మాత అన్నారు.