by Suryaa Desk | Mon, Feb 03, 2025, 12:48 PM
ఐదు రోజుల విరామం తరువాత పసిడి పరుగులకు బ్రేక్ పడింది. గత ఐదురోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై సుమారు రూ.2,600 పెరిగింది.అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాలతో ఇవాళ బంగారం ధర తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల బంగారంపై రూ. 440 తగ్గింది. 22 క్యారట్ల బంగారంపై రూ. 400 తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ల యుద్ధం మొదలు పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్ లో గోల్డ్ రేటు 2800 డాలర్ల పైనే నమోదవుతుంది. ప్రస్తుతం. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ (31.10గ్రాములు) బంగారం ధర రికార్డ్ స్థాయిలో 2,811 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం ఒత్తిడిలతో గోల్డ్ రేటు ఇవాళ దిగొచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో బంగారం ధర తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.77,050 కాగా.. 24 క్యారట్ల ధర రూ.84,050.