by Suryaa Desk | Sun, Feb 02, 2025, 04:00 PM
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా ఆలయాన్ని మాజీ మంత్రి జోగురామన్న ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను మెస్రం వంశీయులు శాలువాతో సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవని మాజీ మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు పరమేశ్వర్, రాజు, నారాయణ, కొండ గణేశ్, దమ్మాపాల్ తదితరులున్నారు.