by Suryaa Desk | Sat, Feb 01, 2025, 11:03 AM
ఆదివాసులు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని తుడుందెబ్బ నాయకులు రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసి విన్నవించారు. శుక్రవారం కేస్లాపూర్ మంత్రిని కలిసి పలు ఆదివాసీ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. చట్టబద్ధతలేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. నాన్ ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలను, ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలన్నారు. నాయకులు గణేష్, దాదిరావు, రేణుక, ఇందిరా, తదితరులున్నారు.