by Suryaa Desk | Mon, Feb 03, 2025, 10:39 AM
బెల్లంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఈ సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీవో మహేందర్ తెలిపారు. ఆర్డిఓ హరికృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు బెల్లంపల్లి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల పరిధిలోని ఆర్జిదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించే వారిని వెల్లడించారు. ఇక నుంచి ఎంపీడీవో కార్యాలయంలోనే సమర్పించాలని సూచించారు.