by Suryaa Desk | Mon, Feb 03, 2025, 01:02 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిసిసి అధ్యక్షుడు శ్రీహరి రావు మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అడ్డంకిగా మారిందని అన్నారు.