by Suryaa Desk | Sun, Feb 02, 2025, 08:06 PM
కులగణన సర్వే పూర్తి చేసుకొని నివేదికను సమర్పించిన ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. FEB 4-2024 కేబినెట్ తీర్మానం చేసుకొని, అదే నెల 16న అసెంబ్లీలో మంత్రిగా సర్వే తీర్మానాన్ని ప్రవేశపెట్టాను. ప్రజలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వ పథకాల్లో సరైన న్యాయం జరగాలంటే భవిష్యత్‌లో ఈ నివేదిక ఉపయోగపడనుంది. ఇచ్చిన మాటకి కట్టబడి దేశానికి దిక్సూచిలా తెలంగాణ మారింది' అని పేర్కొన్నారు.