by Suryaa Desk | Sun, Feb 02, 2025, 11:04 AM
TG: ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం నుంచి ఈనెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానున్నారు. దీంతో ప్రభుత్వం 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హాల్ టికెట్లను కాలేజీ లాగిన్లతోపాటు విద్యార్థుల ఫోన్లకు పంపనున్నారు. కాగా ఈ పరీక్షలు రెండు సెషన్లలో ఉంటాయి. ఉదయం 9 గం. నుంచి మ.12 గం. మధ్యాహ్నం 2గం. నుంచి సా. 5 గం. వరకు పరీక్షలు జరగనున్నాయి.