by Suryaa Desk | Sat, Feb 01, 2025, 02:00 PM
కాజీపేట మండలం శ్రీ భక్త మార్కండేయ జయంతి పురస్కరించుకొని మడికొండలోని పద్మశాలి భవనంలో శనివారం నామని కుమారస్వామి ఆధ్వర్యంలో వేడుకలను ప్రారంభించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు కామని మల్లేష్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భక్త మార్కండేయ మహా ఋషి రథయాత్ర ఊరేగింపు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిల్లా లింగయ్య, నల్ల ప్రభాకర్, పోతరాజు ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.