by Suryaa Desk | Sat, Feb 01, 2025, 11:24 AM
సికింద్రాబాద్ పరిధి వారాసిగూడలో మహిళ మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. జనవరి 22న లలిత(45) అనే మహిళ మృతి చెందారు. తల్లి మృతదేహంతో కుమార్తెలు ఇద్దరు తొమ్మిది రోజులు ఇంట్లోనే ఉండిపోయారు. తిండిలేని స్థితిలో వారు నీరసించిపోయారు. ఈక్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతురాలి కుమార్తెలు రాసిన సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. జనవరి 23న వారు ఈ నోట్‌ను రాసినట్లు గుర్తించారు.మృతురాలి భర్త రాజు కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మేనమామతోనూ 2021 నుంచి తమ కుటుంబానికి గొడవ జరుగుతోందని సూసైడ్ నోట్‌లో కుమార్తెలు వెల్లడించారు. ఇప్పటికే యువతులు ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నేడు లలిత మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతురాలి కుమార్తెలు మానసిక ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. వారిని తీసుకెళ్లేందుకు మృతురాలి ఇంటికి పోలీసులు వచ్చారు.