by Suryaa Desk | Sat, Feb 01, 2025, 12:59 PM
మహా కుంభమేళా వేళే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 24 తేదీల మధ్య ఈ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నాయి.మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.బీదర్ - ధనపుర్ మధ్య ఫిబ్రవరి 14వ తేదీన స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఇది ఉదయం 11 గంటలకు బీదర్ నుంచి బయల్దేరి... రెండో రోజు నాడు రాత్రి 11. 55 గంటలకు ధన్ పుర్ చేరుతుంది. ఈ ట్రైన్ జహీరాబాదాద్, వికారాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్ తో పాటు మరికొన్ని స్టేషన్ల మీదుగా వెళ్తోంది.ఇక హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ధన్ పూర్ కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ ట్రైన్ (నెంబర్ 07112)ఫిబ్రవరి 16వ తేదీన ధన్ పుర్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇక చర్లపల్లి నుంచి ధన్ పుర్ మధ్య మరో సర్వీస్(07077) అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ ఫిబ్రవరి 18,22 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. రెండో రోజు రాత్రి 11. 55 గంటలకు ధన్ పుర్ రైల్వే స్టేషన్ కు చేరుతుంది.ధనపుర్ నుంచి చర్లపల్లికి ఫిబ్రవరి 20, 24 తేదీల్లో ట్రైన్ అందబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ (07078) ధన్ పుర్ నుంచి మధ్యాహ్నం 03.15 గంటలకు బయల్దేరి... రెండో రోజు రాత్రి 11.45 గంటలకు చర్లపల్లి స్టేషన్ కు చేరుతుంది.