by Suryaa Desk | Sun, Feb 02, 2025, 08:07 PM
HYD-గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో కీలక అంశాలు వెలుగుచూశాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. MNC కంపెనీలో పని చేస్తున్న స్నేహితుడి గదిలో ప్రభాకర్ బస చేసినట్లు తెలిపారు. వైజాగ్ జైలులో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు తుపాకులు కొనుగోలు చేశాడని.. జైలులో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు తెలిపారు.