by Suryaa Desk | Sun, Feb 02, 2025, 03:36 PM
సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా రూరల్ మండలం ఫాజుల్ నగర్ రిజర్వాయర్ లోకి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేశారు. నీరు వస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్ లో గంగమ్మ తల్లికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. రైతుల కష్టసుఖాలు తనకు తెలుసునని అన్నారు.