by Suryaa Desk | Sat, Feb 01, 2025, 03:46 PM
రాజేంధ్రనగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ పాత్లపై ఆక్రమణలను తొలగిస్తున్నారు. మైలార్ దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ లో పుట్‌పాత్ పై ఉన్న 120 డబ్బాలను తొలగించారు.నిబంధనలకు విరుద్దంగా ఫుట్‌పాత్ పై అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. పుత్ పాత్ పై వేసిన డబ్బాలను తొలగించిన తర్వాత తిరిగి నిర్వహిస్తే షాపు లైసెన్సు రద్దు చేసి.. . భారీ జరిమానా విధించడమే కాకుండా.. కేసు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.