by Suryaa Desk | Sun, Feb 02, 2025, 04:05 PM
జనగణనపై కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. సమ్మిళిత అభివృద్ధికి జనగణన తప్పనిసరిగా అవసరమని కవిత అన్నారు.జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని కవిత మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుంది..? అని ప్రశ్నించారు. జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుంది..? అని అడిగారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి ఆమె పేర్కొన్నారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.