by Suryaa Desk | Sun, Feb 02, 2025, 03:35 PM
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కూడా కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు జ్ఞానసరస్వతి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.