by Suryaa Desk | Sat, Feb 01, 2025, 10:20 AM
రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయస్సు 60ఏళ్ల నుండి 65 ఏళ్ల కు పెంచడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు అన్నారు. శుక్రవారం సూర్యాపేట లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయస్సు పెంచడాన్ని నిరసిస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ 3 ప్రతుల ను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు