by Suryaa Desk | Sun, Feb 02, 2025, 12:23 PM
చార్మినార్ పాతబస్తీలోని జీ ప్లస్ 4 అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి బిల్డింగ్ కు విస్తరించిన ఘటన బహదూర్ పుర పోలీస్ స్టేషన్ లో శనివారం అర్థరాత్రి జరిగింది. స్థానిక మజ్లిస్ నాయకులు, పోలీసులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. పెద్ద ఎత్తున ఆస్థి నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.