by Suryaa Desk | Sun, Feb 02, 2025, 12:57 PM
ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యతలను ఇస్తుంటారు. బంగారు ఆభరణాలు ధరించి అందరిలో తామే అందంగా ఉండాలని భావిస్తుంటారు.ఇక బంగారం ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు షాపుల్లో ఎగబడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.ఇక కొత్త ఏడాది లోనైనా తగ్గుతాయని మహిళలు భావించారు. నేడు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.77,450 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.84,490 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 1,07,000 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.77,450
24 క్యారెట్ల బంగారం ధర - రూ.84,490
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.77,450
24 క్యారెట్ల బంగారం ధర - రూ.84,490