by Suryaa Desk | Sun, Feb 02, 2025, 02:06 PM
పద్మశ్రీ అవార్డు పొందిన మందకృష్ణ మాదిగకు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6న జరగాల్సిన ఇందిరాపార్క్ దీక్షను విరమిస్తూ, ఫిబ్రవరి 7న జరిగే లక్ష డప్పులు, వేల గొంతులు కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.