![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:36 PM
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు ట్రాన్స్ ఫార్మర్లు పేలడంతో మంగళవారం గ్రామంలోని ఇండ్లలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. సుమారు 50 ఇండ్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది.
షార్ట్ సర్క్యూట్ వల్ల ఇండల్లోని టీవీలు, ఫ్రిడ్జ్ లు, కరెంటు మీటర్లు, సర్వీస్ వైర్లు పేలి పోయాయి. దీంతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.