![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 03:41 PM
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మారడం లేదు. గుడి, బడి, బస్టాండ్, మెట్రో, ఆఫీసు ఇలా ప్రతి చోటు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.మహిళ కన్పిస్తే చాలు ..తమ పశువాంఛ కోసం దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నిర్భయ, పోక్సో.. వంటి కఠిన చట్టాలు అమలు చేసిన కూడా కామాంధుల్లో మాత్రం మార్పులు రావడంలేదు. ప్రతిరోజు కూడా మహిళలపై వేధింపులు, అత్యాచారాల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. చివరకు ఉగాది పండగ పూట హనుమంతుడి ఆలయంకు వెళ్లిన యువతిపై కూడా అత్యాచారం జరిగింది. ఈ ఘటన మాత్రం తెలంగాణలో సంచలనంగా మారింది.నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా ఒక కుటుంబం దైవదర్శనానికి వెళ్లింది. ఈ క్రమంలో సదరు యువతిని కొంత మంది కామాంధులు గమనించారు. ఆమెపైన కన్నేశారు. ఊరుకొండ మండలం ఊరుకొండ పేట ఆంజనేయ స్వామి దేవలయ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులంతా ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్నారు.ఇంతలో యువతి బహిర్భూమికి వెళ్లాల్సి వచ్చింది. ఆమె మరోకరితో వెళ్తుంది. అప్పటికే ఆమె మీద కన్నేసిన నీచులు.. వాళ్ల వెంటే వెళ్లారు. ఆ తర్వాత.. యువతిపై మూకుమ్మడిగా దాడులు చేశారు. మహిళతో వచ్చిన బంధువుపై దాడి చేశారు. యువతిని లాక్కెళ్లి.. ఎనిమిది మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దుర్మార్గుల పశుబలం ముందు..యువతి విలవిల్లాడిపోయింది. ఘటన తర్వాత నీచులంతా పారిపోయారు. ఆ తర్వాత యువతి తన బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆరుగురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. దైవదర్శానికి వెళ్లిన యువతికి ఇలాంటి ఘటన ఎదురుకావడం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దుర్మార్గులను కఠినంగా పనిష్మెంట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.