|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 01:54 PM
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ కొరత ఏర్పడుతుందన్న సోషల్ మీడియా పుకార్లతో హైదరాబాద్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరుగనున్నాయని వార్తలు రావడంతో రెండు రోజులుగా ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. అయితే, సరిపడా నిల్వలు ఉన్నాయని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది.