|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 03:37 PM
పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రాంగణ ఎంపికల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇటీవల జరిగిన ఎంపికల్లో ఆరుగురు విద్యార్థులు ఏడాదికి రూ. 6 లక్షల భారీ వేతనంతో ఉద్యోగాలు పొందారు. వర్సిటీ ఉపకులపతి ప్రొ. శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, శిక్షణ కాలంలో నెలకు రూ. 15 వేలు (ఏడాదికి రూ. 1.80 లక్షలు) వేతనం లభిస్తుంది. అనంతరం పూర్తి స్థాయి ప్యాకేజీ అందుతుంది. గురువారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు.