|
|
by Suryaa Desk | Sun, Mar 23, 2025, 07:03 PM
రాష్ట్ర పోలీసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీసుల రాజ్యం, అణచివేత రాజ్యం అని విరుచుకుపడ్డారు. BRS కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెడితే.. పోలీసులు దొంగలను వదిలి వాళ్ల వెంటపడుతున్నారని అన్నారు.
కరీంనగర్ BRS కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'నేను KCR అంత మంచోడిని కాదు. మళ్లీ మా టైం వస్తుంది. రిటైరయి వేరే దేశం పోయినా రప్పించి మరీ అన్ని లెక్కలు తేలుస్తాం' అని అన్నారు.