|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 11:11 AM
సికింద్రాబాద్-హిస్సార్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ చక్రం విరిగిపోవడంతో ఉప్పల్ సమీపంలోని మడిపల్లి వద్ద రైలు నిలిచిపోయింది. సుమారు నాలుగు గంటల పాటు రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే అధికారులు మరమ్మతుల అనంతరం వేరే ఇంజన్‌తో రైలును తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక మరమ్మతులు చేపట్టారు. అనంతరం కాజీపేట (Kazipet) నుంచి మరో ఇంజిన్‌ను రప్పించి, దాని సహాయంతో రైలును నెమ్మదిగా ఉప్పల్ రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశారు. ఇక రైలు ఇంజిన్ చక్రం విరిగిపోవడంపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పట్టాల నాణ్యత లోపం, ఇంజిన్ మెయింటెనెన్స్ లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.