కామారెడ్డిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయ యాత్ర
Tue, Mar 31, 2026, 02:37 PM
|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 11:47 AM
శ్రీరంగాపురంలో బుధవారం రంగనాథస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకించి తన్మయత్వం పొందారు. ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడిమేఘా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, బ్రహ్మం చారి, శ్రీహరి రాజు, మండ్ల దేవన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.