|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 12:37 PM
TG:రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతి, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోరిక మేరకు తన తల్లి బంగారాన్ని అమ్మి, అతనికి బైక్‌ను బహుమతిగా ఇచ్చింది. డబ్బులు లేకపోవడంతో యువతి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో బంగారం కనిపించకపోవడంతో తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.