|
|
by Suryaa Desk | Thu, Mar 05, 2026, 02:54 PM
కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా టమాటా ధరలు కిలో రూ.30 నుంచి రూ.10కి పడిపోగా, వంకాయ ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. బీరకాయ, పచ్చిమిర్చి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో టమాటా రూ.10, వంకాయ రూ.18, బెండకాయ రూ.28, పచ్చిమిర్చి రూ.50, బంగాళదుంప రూ.18, ఉల్లిగడ్డ రూ.20కు లభిస్తున్నాయి. గుంటూరులో టమాటా రూ.10, వంగ రూ.17, బెండకాయ రూ.17, ఉల్లిగడ్డ రూ.20కు దొరుకుతున్నాయి. విజయవాడలో టమాట రూ.10, వంగ రూ.14, బెండకాయ రూ.19, ఉల్లిపాయలు రూ.22కు లభిస్తున్నాయి.